సూపర్ స్టార్ రజనీకాంత్.. క్లాసిక్ డైరెక్టర్ మణిరత్నం 33 ఏళ్ల తర్వాత తిరిగి మరో సినిమా చేయబోతున్నారా ? అంటే అవుననే చెబుతున్నాయి కోలీవుడ్ వార్తలు. 1991లో రజనీ – మణిరత్నం కలయికలో వచ్చిన ‘దళపతి’ ఎంత పెద్ద హిట్టు అందుకుందో అందరికి తెలిసిందే. అప్పట్లో ఆ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ వచ్చాయి.
కానీ, ఆ తర్వాత ఎందుకో.. ఈ ఇద్దరూ మళ్లీ కలిసి మరో సినిమాని తెరకెక్కించలేదు. ఐతే, 33 ఏళ్ల తర్వాత మళ్లీ రజనీ – మణిరత్నం కాంబో సెట్ అవ్వబోతుందట. ఈ సినిమాకి సంబంధించి రజనీకాంత్, మణిరత్నంకు మధ్య చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తుంది.
ఇప్పడున్న సమాచారం ప్రకారం అన్నీ అనుకున్నట్లు జరిగితే డిసెంబరులో రజనీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మణిరత్నం ప్రస్తుతం కమల్ హాసన్ తో ‘థగ్ లైఫ్’ సినిమా చేస్తున్నాడు. అటు సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘వేట్టయన్’ విడుదలకు సిద్దంగా ఉంది. అలాగే, రజని నటిస్తోన్న మరో చిత్రం ‘కూలీ’ సినిమా షూటింగ్ దశలో ఉంది. అదేవిధంగా ‘జైలర్ 2’ పట్టాలెక్కేందుకు రెడీగా ఉంది. ఈ సినిమాల తర్వాత రజనీ – మణిరత్నం కాంబో సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తుంది.
The post 33 సంవత్సరాల తరువాత క్రేజీ కాంబో! first appeared on Andhrawatch.com.