VD12 అప్డేట్ వచ్చేది ఎప్పుడంటే! టాలీవుడ్ రౌడీ స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా సినిమా ప్రస్తుతం VD12 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాను డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలో విజయ్ పాత్ర అల్టిమేట్‌గా ఉండబోతుందని మూవీ టీమ్ తెలిపింది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే విజయ్ లుక్ ఎలా ఉండబోతుందా అనే విషయాన్ని చిత్ర బృందం ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చింది.
దీంతో ఈ సినిమా నుంచి మరో అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.కాగా, ఈ సినిమా నుంచి ఓ సాలిడ్ అప్డేట్ అయితే ఇచ్చేందుకు సినిమా బృందం రెడీ అవుతుంది. ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుంది.
ఇక ఈ సినిమాకు ‘సామ్రాజ్యం’ అనే టైటిల్ పెట్టినట్లుగా సినీ వర్గాల్లో వార్తలు వినపడుతున్నాయి. అయితే, ఇప్పుడు ఈ మూవీ అప్డేట్‌ను ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. మరి నిజంగానే ఈ సినిమాకు సామ్రాజ్యం టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేస్తారా.. లేక వేరొక టైటిల్‌తో VD12 అప్డేట్ రాబోతుందా.. అనేది మాత్రం ప్రస్తుతానికి సమాచారం.
The post VD12 అప్డేట్ వచ్చేది ఎప్పుడంటే! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
