యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్స్‌కు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ కచ్చితంగా ఉంటుంది. అలాంటి కథా కథనాలతో “YO! 10 ప్రేమకథలు” సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని పి సి క్రియేషన్స్ సమర్పణలో, మనూటైమ్ మూవీ మిషన్ సంస్థ తెరకెక్కిస్తుంది.
ఈ సినిమాలో పది మంది పేరున్న హీరో హీరోయిన్లు నటిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. “YO! 10 ప్రేమకథలు” చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు, రచయిత అయినటు వంటి నంది అవార్డ్ గ్రహీత మనోహర్ చిమ్మని తెరకెక్కిస్తున్నారు.
ఆయన గతంలో “కల”, “అలా”, “వెల్కమ్”, “స్విమ్మింగ్ ఫూల్” వంటి చిత్రాలతో ప్రతిభావంతమైన దర్శకుడిగా టాలీవుడ్ లో పేరు తెచ్చుకున్నారు. తాజాగా “YO! 10 ప్రేమకథలు” సినిమా లాంఛనంగా మొదలైంది. ప్రముఖ దర్శకులు వీరశంకర్, చంద్రమహేశ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వీరశంకర్ మూవీ పోస్టర్ పై క్లాప్ ని కొట్టి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
The post YO! 10 ప్రేమకథలు’ …గ్రాండ్ లాంఛ్! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
