అక్కినేని అఖిల్ ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఆయన కొంత గ్యాప్ తరువాత తన కొత్త ప్రాజెక్ట్‌ని మొదలుపెట్టాలని చూస్తుండటంతో, ఈసారి అఖిల్ ఎలాంటి సినిమాతో వస్తాడా అని అక్కినేని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, అఖిల్ నెక్స్ట్ మూవీని ఎవరితో చేస్తాడా అనేది కూడా ఆసక్తికరంగా మారింది.
కాగా, అఖిల్ ఇప్పటికే తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ని ఓకే చేసినట్లుగా తెలుస్తోంది. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ వంటి డీసెంట్ మూవీని తెరకెక్కించిన మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్షన్లో అఖిల్ ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట. ఈ సినిమా రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిందని..ఇందులో ఎమోషన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటాయని చిత్ర వర్గాల్లో టాక్ జోరుగా వినపడుతుంది.
ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తాడని, అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయనుందని వార్తలు వినపడుతున్నాయి. మరి ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడెప్పుడు వస్తుందా అని అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగాఎదురు చూస్తున్నారు.
The post అఖిల్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటంటే! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
