హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాబిన్‌హుడ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకుల్లో అంచనాలను రెట్టింపు చేశాయి.
ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో సాలిడ్ ట్రీట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ సినిమాలోని ‘అది దా సర్‌ప్రైజు’ అంటూ సాగే మాస్ సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సాంగ్‌లో హాట్ బ్యూటీ కేతిక శర్మ తన గ్లామర్ షోతో పాటు అదిరిపోయే స్టెప్పులతో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఇక ఈ పాటను మార్చి 10న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది.
ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా భారీ తారాగణం నటిస్తున్నారు. ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 28న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
The post ‘అది దా సర్‌ప్రైజు’ ఎప్పుడంటే! first appeared on Andhrawatch.com.