ప్రస్తుతం భారీ హైప్ నడుమ బిగ్ స్క్రీన్స్ పై వచ్చేందుకు సిద్ధంగా ఉన్న సినిమా ఏదన్నా ఉంది అంటే ఆ చిత్రం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ కాంబోలో చేసిన మూవీ “దేవర” అనే చెప్పాలి. మరి ఈ భారీ సినిమాకి కూడా సీక్వెల్ ఉన్న సంగతి దేవర పార్ట్ 1 కి ముందే ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే ఇపుడు పార్ట్ 1 రాబోతుండగా పార్ట్ 2 పై ఇంట్రెస్టింగ్ క్లారిటీ ఒకటి బయటకి వచ్చింది. కొరటాల పార్ట్ 2 పై మాట్లాడుతూ దేవర పార్ట్ 2 ని సరైన సమయంలోనే మొదలు పెట్టాలని… ఎన్టీఆర్ తో పాటు ఇతర నటీనటులు డేట్స్ అన్నీ పర్ఫెక్ట్ గా సెట్ అయితే తప్ప దేవర 2 మొదలు పెట్టనని క్లారిటీ ఇచ్చేసారు.
ఒకవేళ బాగా లేట్ అవుతుంది అనిపిస్తే ఈ గ్యాప్ లో మరో సినిమా స్టార్ట్ చేసేసి తర్వాత దేవర 2 మీదకు వస్తానని కొరటాల ఓ క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ భారీ సినిమాకి అనిరుద్ సంగీతం అందించాడు. అలాగే రేపు సెప్టెంబర్ 27న చిత్రం భారీ గా విడుదల కాబోతుంది.
The post అది సంగతి మరి! first appeared on Andhrawatch.com.