అనిల్‌ రావిపూడి ఎమోషనల్‌ పోస్ట్‌! | CineChitram

టాలీవుడ్ సినిమాలో  సంక్రాంతి కానుకగా విడుదలకి వచ్చిన తాజా సినిమాల్లో వెంకీ మామ హీరోగా నటించిన సెన్సేషనల్ హిట్ సినిమా “సంక్రాంతికి వస్తున్నాం” కూడా ఓ మూవీ. అయితే ఈ సినిమాతో తన కెరీర్లో మరో భారీ విజయాన్ని కైవసం చేసుకున్న డైరెక్టర్‌ అనీల్ రావిపూడి టాలీవుడ్ కి హిట్ మెషీన్ లా మారారు.

అయితే తాను ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లు అయ్యిన ఎమోషనల్ మూమెంట్ లో తనో పోస్ట్ ని అభిమానులతో షేర్ చేసుకున్నారు. పదేళ్ల క్రితం “పటాస్” సినిమా విడుదల అయ్యింది. అది నా జీవితాన్నే మార్చేసింది. దర్శకునిగా మాత్రమే కాకుండా ఇలా ఈరోజు నేనిలా ఉన్నాను అంటే అందుకు మూల కారణం ఆ సినిమానే అని తెలిపారు.

అలాగే వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రతీ మూమెంట్, ప్రతీ క్షణం, ప్రతీ సవాలు పాఠం నేర్పించాయి అని తన జర్నీలో భాగమైన సన్నిహితులకు కుటుంబానికి తనమీద నమ్మకం పెట్టుకున్న వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని ఈ పదేళ్లు పూర్తయ్యిన సందర్భంగా ఇదే ఎంటర్టైన్మెంట్ ని తాను కొనసాగిస్తూ మంచి సినిమాలు అందించే ప్రయత్నం చేస్తానని అనీల్ రావిపూడి ప్రామిస్ చేస్తున్నారు. దీంతో తన పోస్ట్ ఇపుడు వైరల్ గా మారింది.

The post అనిల్‌ రావిపూడి ఎమోషనల్‌ పోస్ట్‌! first appeared on Andhrawatch.com.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …