అన్ని భాషాల్లో విడుదల చేస్తున్నాం! | CineChitram

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప 2′. పార్ట్-1 కు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై వరల్డ్ వైడ్ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ కు ఆడియన్స్ నుంచి అనూహ్య స్పందన లభించింది. డిసెంబర్ 6 న సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

కానీ నేడు ఓ ప్రెస్ మీట్ పెట్టి సినిమాను ఒక్కరోజు ముందే తీసుకొస్తున్నామని వెల్లడించారు. అలాగే సినిమాకు సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నలకు సమాదానాలు ఇచ్చారు. ఇందులో భాగంగానే ఓ విలేకరి..’ పుష్ప 2′ ను పాన్ ఇండియాతో పాటూ ఇతర భాషల్లో రిలీజ్ చేసే ప్లాన్ ఏమైనా ఉందా?’ అని అడగ్గా.. నిర్మాత బదులిస్తూ..’ ‘పుష్ప 2’ ను వీలైనన్ని భాషల్లో రిలీజ్ చేయబోతున్నాం.

దానికి సంబంధించి మేము కొన్ని ప్లాన్స్ కూడా చేస్తున్నాం. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంతో పాటూ స్పానిష్, జాపనీస్, రష్యన్, చైనీస్.. ఇలా వీలైనన్ని ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ చేస్తాం. కాకపోతే ముందు పాన్ ఇండియా రిలీజ్ అయిన.. 2,3 నెలలకు అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేయాలని అనుకుంటున్నాం..” అంటూ తెలిపారు. దీంతో నిర్మాత చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

The post అన్ని భాషాల్లో విడుదల చేస్తున్నాం! first appeared on Andhrawatch.com.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …