నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం డాకు మహారాజ్ తో సెన్సేషనల్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం తర్వాత బాలయ్య నుంచి రాబోతున్న అవైటెడ్ చిత్రమే “అఖండ 2 తాండవం”. దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రంపై సాలిడ్ అంచనాలు నెలకొన్నాయి.
అఖండ మొదటి భాగమే ఎంతో గ్రాండ్ గా ప్లాన్ చేయగా ఇపుడు అఖండ 2 పై మరిన్ని ఇంట్రెస్టింగ్ అంశాలు వినిపిస్తున్నాయి. దీనితో పార్ట్ 2 కోసం మాత్రం ఆడియెన్స్, అభిమానులు ఊహించని లెవెల్ ప్లానింగ్స్ ని బోయపాటి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మెయిన్ గా సినిమా కోసం బోయపాటి భారీ సెట్టింగ్స్ ని వేయించారట.
అంతే కాకుండా లాస్ట్ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఉన్నట్టుగానే పరమ శివుని భారీ విగ్రహం లానే పార్ట్ 2కి దానికి మించిన పవర్ఫుల్ సెట్టింగ్ ని రెడీ చేయించినట్టుగా తెలుస్తుంది. దీనితో ఈసారి పార్ట్ 2 తాండవం మాత్రం మామూలుగా ఉందని సినీ వర్గాల్లో టాక్.
The post అసలు మామూలు ప్లానింగ్స్ కాదుగా! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
