ఆ మూవీ కోసం అనిరుధ్! కోలీవుడ్ స్టార్ హీరోస్ లో ఒకరైన అజిత్ కుమార్ హీరోగా ఇపుడు నటిస్తున్న భారీ చిత్రం “గుడ్ బ్యాడ్ అగ్లీ” కోసం తెలిసిందే. దీనికి ముందు వచ్చిన పట్టుదల సినిమా అనుకున్న రేంజ్ లో హిట్ కాలేదు కానీ ఓటిటికి వచ్చాక మంచి మార్కులు అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత గుడ్ బ్యాడ్ అగ్లీపై మాత్రం భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమాని దర్శకుడు ఆదిక్ రవి చంద్రన్ తెరకెక్కించగా అజిత్ నుంచి మాస్ ట్రీట్ ని ప్రామిస్ చేసాడు. దీనితో అజిత్ కెరీర్లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుంది అని చాలా మంది గట్టిగా నమ్ముతున్నారు. అయితే ఇపుడు గుడ్ బ్యాడ్ అగ్లీ ఫస్ట్ సింగిల్ కోసం మేకర్స్ మంచి హైప్ ఎక్కిస్తుండగా సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కూడా ఈ సాంగ్ కోసం ఫ్యాన్స్ ని టీజ్ చేస్తున్నాడు. అయితే ఇపుడు మరో ఇంట్రెస్టింగ్ బజ్ దీనిపై వినిపిస్తుంది.
దీనితో ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ని సెన్సేషనల్ సంగీత దర్శకుడు అనిరుద్ తో పాడించినట్టుగా తెలుస్తుంది. ఇది కానీ నిజం అయితే అజిత్ ఫ్యాన్స్ కి మరో గట్టి ట్రీట్ నే వస్తుంది అని చెప్పవచ్చు. ఇక దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.
The post ఆ మూవీ కోసం అనిరుధ్! first appeared on Andhrawatch.com.