ఆయన దొరకడం ఓ అదృష్టం! నందమూరి బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన క్రమంలో నారా భువనేశ్వరి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్లో జరిగిన ఈ వేడుకలో కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఇతర ప్రముఖులు చాలా మంది పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు.. బాలకృష్ణతో తన అనుబంధాన్ని పంచుకుంటూ క్రేజీ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ, చంద్రబాబు ఏం మాట్లాడారు అంటే.. ‘ఒక పక్కన బాలయ్య.. మరోపక్క అంతే పవర్ఫుల్ లేడీ భువనేశ్వరి.. ఇద్దరి మధ్య ఇప్పుడు నేను నలిగిపోతున్నా అని ఆయన నవ్వుతూ మాట్లాడటం అక్కడున్న వారిని ఆకర్షించింది. బాబు ఇంకా మాట్లాడుతూ.. వీరిద్దరి మధ్య ఉంటే ఎంతో ప్రమాదం.
నిన్నటి వరకూ అల్లరి బాలయ్య ఇప్పుడు పద్మభూషణ్ బాలయ్య. దేశం గర్వించదగ్గ బిడ్డ. మా కుటుంబంలో ఇలాంటి అవార్డు రావడం ఇదే తొలిసారి. కుటుంబ సభ్యులందరం ఎంతో గర్వపడుతున్నాం. నాకొక అద్భుతమైన బావమరిది దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నా’’ అంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు.
The post ఆయన దొరకడం ఓ అదృష్టం! first appeared on Andhrawatch.com.