గ్లోబల్ స్టార్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా గేమ్ ఛేంజర్ కోసం అందరికీ తెలిసిందే. అయితే RRR లాంటి గ్లోబల్ హిట్ తర్వాత తన నుంచి సోలోగా వచ్చిన ఈ సినిమా విఫలం అయ్యింది. ఇక ఈ సినిమా తర్వాత అంచనాలు అన్నీ ఈ దర్శకుడు బుచ్చిబాబు సానాతో చేస్తున్న తన 16వ సినిమా మీదే ఉన్నాయి. అయితే ఈ సినిమాపై సాలిడ్ బజ్ ఇపుడు వినిపిస్తోంది.
దీనితో గేమ్ ఛేంజర్ తరహాలోనే సాలిడ్ ఎపిసోడ్ ఒకటి చరణ్ 16లో కూడా ఉంటుంది అని టాక్. మరి గేమ్ ఛేంజర్ ఫలితం ఎలా ఉన్నా సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ఆ ఎపిసోడ్ ఇంకా ఎక్కువ ఉన్నా బాగుణ్ణు అని కూడా చాలా మంది అనుకున్నారు. మరి ఇప్పుడు బుచ్చిబాబు సినిమాలో కూడా మంచి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చరణ్ పై ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సినిమాలో సే ఎపిసోడ్ కూడా చాలా బాగా వస్తుంది అన్నట్టు కూడా టాక్. మరి ఈ భారీ ప్రాజెక్ట్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో వేచి చూడాలి.
The post ఇందులో కూడా! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
