ఎందుకా ధైర్యం! | CineChitram

కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘క ‘. దర్శక ద్వయం సుజీత్ – సందీప్ అనే ఇద్దరు కుర్రాళ్ళు ఈ సినిమాని డైరెక్ట్‌ చేస్తున్నారు.  పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో సాగనున్న ఈ సినిమాని భారీ బడ్జెట్ తో, క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు.

విరూపాక్ష టైపు మిస్టిక్ థ్రిల్లర్ నేపథ్యంలో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.  ఇటీవల వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన కిరణ్ ఈ సినిమా తనకు సక్సెస్ ఇస్తుందని ఎంతో నమ్మకంగా ఉన్నాడు. కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమాను దసరా కానుకగా విడుదలకు ప్లాన్ చేసి మరల విరమించుకున్నారు. తాజాగా ఈ సినిమాను అక్టోబరు 31న దీపావళి కానుకగా విడుదల చేస్తున్నట్టు అధికారకంగా ప్రకటించారు మేకర్స్.

ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ను నిర్మాత  వంశీ నందిపాటి రూ. 13 కోట్లకుదక్కించుకున్నారు. ఇక్కడ చిత్రం ఏంటంటే మలయాళం లో ఈ సినిమాను దుల్కర్ విడుదల చేస్తుండగా తెలుగులో దుల్కర్ సినిమా లక్కీ భాస్కర్ తో పోటీగా రిలీజ్ కాబోతుండడం విశేషం. పాన్ ఇండియా భాషలలో నిర్మించిన ఈ సినిమా 5 సినిమాల మధ్య పోటీగా విడుదల కాబోతుంది.

ఇటీవల ఈ చిత్ర ప్రమోషన్స్ ను ఈ హీరో మొదలు పెట్టాడు. అందులో భాగంగా ఈ సినిమాకు హైలెట్ గా నిలిచే మాస్ జాతర సాంగ్ ను ఓ ప్రముఖ యూనివర్సిటీలో స్టూడెంట్స్ మధ్య విడుదల చేసి డాన్స్ చేస్తూ అలరించాడు కిరణ్ అబ్బవరం.

The post ఎందుకా ధైర్యం! first appeared on Andhrawatch.com.

About

Check Also

Vishwak Sen’s female look from Laila unveiled | CineChitram

Mass Ka Das Vishwak Sen has garnered a separate fan base in the youth and …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading