ఇక ఇప్పుడు ఎన్టీఆర్ తన తరువాత సినిమాని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో చేయనున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ను త్వరలో మొదలు పెట్టాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. అయితే, ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను పెట్టాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారట. కానీ, ఇప్పుడు ఈ టైటిల్ విషయంలో సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది.
ఈ టైటిల్‌ను ఎన్టీఆర్ చిత్రానికి పెట్టవద్దంటూ అభిమానులు అంటున్నారు. తమిళ డైరెక్టర్ కమ్ యాక్టర్ ప్రదీప్ రంగనాథన్ నటిస్తున్న తాజా సినిమాకి ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారంట. దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ చిత్రానికి కూడా అదే టైటిల్ పెడితే విడుదల సమయంలో గందరగోళం నెలకొనే అవకాశాలున్నాయని అభిమానులు అంటున్నారు. దీంతో ఇప్పుడు ఎన్టీఆర్-నీల్ మూవీ టైటిల్‌పై మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది వేచి చూడాల్సిందే.
The post ఎన్టీఆర్-నీల్ సినిమాకు టైటిల్ సమస్య..? first appeared on Andhrawatch.com.