ఎన్టీఆర్-నీల్ సినిమాలో ఛాన్స్.. రుక్మిణి! | CineChitram

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన తరువాత సినిమాని  దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాను అధికారికంగా మొదలు పెట్టారు. ఇక రెగ్యులర్ షూటింగ్ జరుపుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే, గతకొద్ది రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన క్యాస్టింగ్‌పై కొన్ని వార్తలు సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి.

ఎన్టీఆర్-నీల్ కాంబోలో ప్రెస్టీజియస్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో అందాల భామ రుక్మిణి వాసంత్ హీరోయిన్‌గా ఎంపిక అయ్యిందని.. వీరి కాంబో సూపర్‌ గా ఉంటుందనే టాక్ ఇటు సినీ వర్గాల తో పాటు అటు సోషల్ మీడియాలో జోరుగా నడుస్తుంది. అయితే, ఇదే విషయాన్ని రుక్మిణి వాసంత్ దగ్గర తీసుకుని రాగా, ఆమె ఎలాంటి సమాధానం లేకుండా మౌనంగా ఉందని.. ఇలాంటి ఆఫర్ వస్తే ఎవరు మాత్రం చేయరు..అని అర్థం వచ్చేలా సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.

దీంతో, అసలు ఎన్టీఆర్-నీల్ మూవీలో రుక్మిణి వాసంత్ నిజంగానే నటిస్తుందా.. లేక వినిపిస్తున్న వార్తలన్నీ కూడా కేవలం రూమార్సేనా.. అనే విషయంపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇస్తే బాగుంటుందని అభిమానులు అనుకుంటున్నారు.

The post ఎన్టీఆర్-నీల్ సినిమాలో ఛాన్స్.. రుక్మిణి! first appeared on Andhrawatch.com.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …