ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో మంచి ఫేమ్ ఉన్న హీరోల్లో కన్నడ రాకింగ్ స్టార్ యష్ కూడా ఒకరు. తన సెన్సేషనల్ హిట్ సినిమాలు “కేజీయఫ్” సిరీస్ తో అదరగొట్టగా ఆ సినిమాలు ఇచ్చిన ఫేమ్ తర్వాత తాను ఎలాంటి సినిమా చేస్తాడు అనేది అందరికీ పెద్ద ప్రశ్నగా మారింది.
కేజీయఫ్ తో వచ్చిన స్టార్డంని నిలబెట్టుకోగలడా లేదా అనేది ఆసక్తిగా మారిన సమయంలో మళయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తో అనౌన్స్ చేసిన మూవీనే “టాక్సిక్”. మరి అనౌన్సమెంట్ తోనే మంచి హైప్ ని అందుకున్న ఈ మూవీ నుంచి నేడు యష్ పుట్టినరోజు కానుకగా చిన్న గ్లింప్స్ ని మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
మరి ఈ గ్లింప్స్ లో యష్ నుంచి కొత్త వెర్షన్ కన్పిస్తుండగా తనలోని కంప్లీట్ రొమాన్స్ యాంగిల్ కనిపిస్తుంది. అలాగే మ్యూజిక్ కూడా బాగానే ఉంది. కానీ మేకర్స్ ఇచ్చిన హైప్ ని అభిమానులు ఏదో ఊహించుకుంటే వీరు ఇంకేదో వదిలారు అనే కామెంట్లు ఎక్కువగా వినపడుతున్నాయి. దీంతో యష్ బర్త్ డే ట్రీట్ మాత్రం డిజప్పాయింటింగ్ గా మిక్స్డ్ రెస్పాన్స్ నే అందుకుంది అని తెలుస్తుంది.
The post ఏంది భాయ్ ఇది! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
