ఓజీ పరిమితి ఇక్కడ వరకేనా! | CineChitram

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న సుజీత్ దర్శకత్వం వహించిన సినిమా ‘ఓజీ’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి నుంచే ఈ ప్రాజెక్ట్‌కి ఉన్న హైప్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ విషయంలో రికార్డ్ స్థాయి కలెక్షన్స్ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ స్థాయిలో ఉన్న క్రేజ్ పాన్ ఇండియా రేంజ్‌లో మాత్రం కనిపించలేదని చెప్పాలి.

ప్రారంభంలోనే ఈ సినిమాను హిందీ, తమిళ్‌తో పాటు పలు భాషల్లో విడుదల చేస్తామని మేకర్స్ చెప్పినా, రిలీజ్ సమయం దగ్గర పడుతున్నా ఆ భాషల ప్రమోషన్లలో ఎటువంటి బజ్ లేకపోవడం గమనార్హం. ట్రైలర్‌ నుంచి పోస్టర్స్‌ వరకూ అన్ని అప్‌డేట్స్‌లో తెలుగు వర్షన్‌కే ప్రాధాన్యం ఇచ్చారు. అందుకే ‘ఓజీ’ ఎక్కువగా తెలుగు ఆడియెన్స్ కోసం మాత్రమే మలచబడిన ప్రాజెక్ట్‌గా మారిపోయిందని చెప్పవచ్చు.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …