టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా యువ హీరోయిన్ నయన్ సారిక హీరోయిన్ గా దర్శకులు సందీప్, సరోజ్ లు సంయుక్తంగా తెరకెక్కించిన క్రేజీ థ్రిల్లర్ మూవీ “క”. ఈ దీపావళి కానుకగా విడుదలకి వచ్చిన ఈ సినిమా అంచనాలు అన్నీ అందుకొని అంత పోటీలో కూడా సాలిడ్ వసూళ్లు అందుకుని కిరణ్ అబ్బవరం కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
ఇక నెమ్మదిగా పాన్ ఇండియా భాషల్లో కూడా ఈ సినిమా విడుదలకి వస్తుండగా ఇపుడు తెలుగులో ఓటిటి విడుదలకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ సంస్థ ఈటీవీ విన్ పొందింది.
అయితే వీరు తాజాగా సినిమా విడుదల పై ఓ హింట్ ఇచ్చారు. దీంతో అతి త్వరలోనే “క” ఓటిటిలో సందడి చేయనుంది అని చెప్పుకొవచ్చు. అయితే ఈ వారమే లేదా వచ్చే వారం “క” ఓటిటిలో దర్శనం ఇవ్వనుందని తెలుస్తుంది. మరి ఒక్క డేట్ పై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
The post ఓటీటీ విడుదలకు సిద్దమైన క! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
