రీసెంట్ గా మన తెలుగు సినిమా నుంచి వచ్చిన పలు చిత్రాల్లో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం అలాగే తన తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు నిఖిల్ తెరకెక్కించిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా “బ్రహ్మ ఆనందం”. మరి డీసెంట్ ప్రమోషన్స్ నడుమ థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం ఇపుడు ఓటిటిలో అలరించేందుకు వచ్చేసింది.
ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా నేటి నుంచి అందులో అందుబాటులోకి వచ్చేసింది. కానీ ఈరోజు కేవలం ఆహా గోల్డ్ ని వినియోగించేవారికి మాత్రమే నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. నార్మల్ సబ్ స్క్రైబర్స్ కి రేపు మార్చ్ 20 నుంచి అందుబాటులో ఉండనుంది. సో వారు రేపటి నుంచి చూడొచ్చు. ఇక ఈ చిత్రానికి శాండిల్య పీసపాటి సంగీతం అందించగా స్వధరం ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.
The post ఓటీటీలోకి బ్రహ్మ ఆనందం! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
