కింగ్డమ్‌ ఓటీటీ పార్టనర్‌ ఎవరంటే..! | CineChitram

రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘కింగ్డమ్’ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాపై రిలీజ్‌కి ముందే మంచి ఆసక్తి నెలకొంది. దీంతో అభిమానులు సినిమాను థియేటర్లలో చూసేందుకు భారీగా హాజరవుతున్నారు.

ఇప్పటికే సినిమాపై పాజిటివ్ టాక్ రావడంతో ఓటీటీ హక్కులపై కూడా క్లారిటీ వచ్చింది. ఈ చిత్రానికి డిజిటల్ హక్కులు నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. తాజా సమాచారం ప్రకారం, సినిమా రిలీజ్ అయ్యిన నాలుగు వారాల తర్వాత ఇది ఓటీటీలో స్ట్రీమింగ్‌కి రానుంది. దీంతో ఆగస్టు చివరి వారం కల్లా నెట్‌ఫ్లిక్స్‌లో ‘కింగ్డమ్’ చూసే అవకాశముంటుందని టాక్.

ఈ సినిమాలో విజయ్ సరసన భాగ్యశ్రీ బొర్సె కథానాయికగా నటించగా, సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించాడు. సంగీతాన్ని అనిరుధ్ అందించగా, నిర్మాణ బాధ్యతలను నాగవంశీ, సాయి సౌజన్య కలిసి చేపట్టారు. ‘కింగ్డమ్’ విజయవంతమవుతుందనే నమ్మకంతో చిత్రబృందం ఊపులో ఉంది.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …