కేరళలో రజినీ అల్లాడిస్తున్నాడుగా..! | CineChitram

తమిళ హీరో రజినీకాంత్ నటించిన కొత్త సినిమా ‘కూలీ’ పై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. యాక్షన్ మరియు ఎమోషన్ మిక్స్ అయిన ఈ సినిమాను వచ్చే వారం విడుదల చేయనున్నారు. సినిమా విడుదలకు ముందే ఈ ప్రాజెక్ట్‌కు భారీ క్రేజ్ అయితే వచ్చేసింది.

ప్రత్యేకంగా కేరళలో ఈ సినిమాపై విపరీతమైన స్పందన కనిపిస్తోంది. అక్కడి ప్రేక్షకులు ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌కి దూసుకెళ్లారు. కూలీ చిత్రం కేరళ మార్కెట్లో మాత్రమే రెండు కోట్ల రూపాయల వరకు ప్రీ-రిలీజ్ బిజినెస్ చేయడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. సినిమా విడుదలైన తర్వాత ఇంకా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాలో రజినీకాంత్ పాత్రతో పాటు, ఉపేంద్ర, నాగార్జున, సత్యరాజ్, శ్రుతి హాసన్ లాంటి పలువురు ప్రముఖ నటులు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ భారీ ఖర్చులతో ఈ చిత్రాన్ని నిర్మించింది.

లోకేష్ కనగరాజ్ స్టైల్లో మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయని టీజర్, ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది. అందుకే కూలీ చిత్రం రజినీకాంత్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా, అన్ని ప్రాంతాల సినీ ప్రేమికుల్లోనూ భారీ ఆసక్తి పెంచుతోంది.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …