యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నట్లు తెలుస్తుంది, ఈ సినిమాను ‘శర్వా 37’ అనే వర్కింగ్ టైటిల్‌తో చిత్ర బృందం రూపొందిస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించి మేకర్స్ తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు.
శర్వా 37 మూవీ షూటింగ్ ప్రస్తుతం కేరళలో జరుగుతోంది. హీరో శర్వానంద్, హీరోయిన్ సాక్షి వైద్యలపై ఓ సాంగ్ ని రూపొందిస్తున్నారు. కొరియోగ్రఫర్ బృందా మాస్టర్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ షూటింగ్ పూర్తి కావడంతో, కేరళ షెడ్యూల్ ముగిసినట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఈమేరకు చిత్ర యూనిట్ మొత్తం ఓ ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సినిమాలో మరో బ్యూటీ సంయుక్త మీనన్ కూడా నటిస్తుంది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం ఇస్తున్నాడు. ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.
The post కేరళలో సైలెంట్ గా పని ముగించేసిన శర్వా 37! first appeared on Andhrawatch.com.