శ్యామ్ సింగ రాయ్ ఫేమ్ ‘రాహుల్ సంకృత్యాన్’ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తోంది. ఈ చిత్రంలో హాలీవుడ్ సినిమా ‘ది మమ్మీ’తో పాపులరైన ఆర్నాల్డ్ వోస్లూ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.
1854-78 మధ్య కాలంలో జరిగే ఈ కథలో విజయ్ దేవరకొండ పాత్ర తర్వాత ఆయన పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. ఆర్నాల్డ్ వోస్లూ లాంటి స్టార్ విజయ్ దేవరకొండ సినిమాలో నటిస్తే సినిమాకి చాలా బాగా ప్లస్ అవుతుంది. కాగా ఈ మూవీ షూటింగ్ 2025 జనవరి నుంచి మొదలయ్యే అవకాశాలున్నాయి.
‘రాహుల్ సంకృత్యాన్’ దర్శకత్వంలో నేచులర్ స్టార్ నాని హీరోగా వచ్చిన శ్యామ్ సింగ రాయ్ సినిమా మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో విజయ్ దేవరకొండ సినిమా పై కూడా భారీ అంచనాలు పెరిగాయి.
The post కొండన్న సినిమాలో ఆ నటుడు! first appeared on Andhrawatch.com.