తమిళ్ లో సూర్య హీరోగా AR మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ‘గజనీ’. తెలుగులోనూ డబ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది. సూర్య కు తెలుగులో స్టాండర్డ్ మార్కెట్ వచ్చేలా చేసింది. అంతటి సంచలనాలు నమోదు చేసిన ఈ సినిమా పలు భాషల్లో స్టార్ హీరోలు రీమేక్ చేసి హిట్లు అందుకున్నారు. అలా బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్ తో తెలుగు అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాను హిందీ లో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.
కాగా ఇప్పుడు ఈ సినిమాకు సిక్వెల్ చేసే ఆలోచనలో అమీర్ ఖాన్ ఉన్నాడు. ఈ బాలీవుడ్ హీరో చాలా సంవత్సరాల తర్వాత తమిళ సినిమాలో యాక్ట్ చేయబోతున్నాడు. రజనీకాంత్ హీరోగా స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘కూలీ’ చిత్రంలో అమీర్ ఖాన్ కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, టాలీవుడు స్టార్ హీరో అక్కినేని నాగార్జున, మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాసిల్ ఈ సినిమాలో యాక్ట్ చేశారు.
తాజాగా అమీర్ ఖాన్ వచ్చి చేరడంతో కూలి పై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ షూట్ లో భాగంగానే అమీర్ ఖాన్ తర్వాతి సినిమా ఏమిటనేది చర్చకు రాగా గజనీ 2 కు సంబంధించి ఇటీవల కథ చర్చలు మొదలైనట్టు తమిళ సినీవర్గాలు పేర్కొన్నాయి. అయితే దర్శకుడు ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు. అదే గనక జరిగితే అమీర్ ఖాన్ కెరీర్ లో మరొ సెన్సషనల్ హిట్ పడటం గ్యారెంటీ.
The post గజినీ సీక్వెల్ లో అమిర్ ఖాన్! first appeared on Andhrawatch.com.