గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా భారీ సినిమా “గేమ్ ఛేంజర్” గురించి అందరికీ తెలిసిందే. కోలీవుడ్ మావెరిక్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ అనుకున్న అంచనాలు వసూళ్లు పరంగా అంచనాలనుఅందుకోలేదు కానీ చరణ్ నటన సహా ఇతర అంశాలకి మంచి మార్కులు పడ్డాయి.
ఇక ఈ సినిమా థియేటర్స్ లో రన్ ఇపుడు పూర్తి చేసేసుకుంది. అయితే ఫైనల్ గా ఈ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ అఫీషియల్ గా వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. మరి ఇందులో ఈ ఫిబ్రవరి నుంచి తెలుగు, కన్నడ సహా తమిళ భాషల్లో ఈ ఫిబ్రవరి 7 నుంచి స్ట్రీమింగ్ కి రానున్నట్టుగా ప్రకటించచారు.
మరి ఓటిటిలో వచ్చాక ఈ సినిమా రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా దిల్ రాజు నిర్మాణ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. హిందీ, మళయాళ భాషల్లో స్ట్రీమింగ్ కోసం ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.
The post గేమ్ ఛేంజర్ ఓటీటీ డేట్ వచ్చేసింది! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
