గొంతు సవరించిన వెంకీ మామ! | CineChitram

స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న తాజా సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు పెంచేసింది. ఈ సినిమాను డైరెక్టర్‌ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా.. పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అయ్యింది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకుల్లో అంచనాలను విపరీతంగా పెంచేశాయి.

ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రెండు సాంగ్స్ విడుదల అవ్వగా..అవి బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్‌ను అందుకున్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా నుండి మూడో సాంగ్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను మేకర్స్ తాజాగా ప్రకటించారు. ‘బ్లాక్‌బస్టర్ పొంగల్’ అంటూ సాగే ఈ ఎలక్ట్రిఫయింగ్ పాట కోసం హీరో వెంకటేష్ తన వాయిస్‌ను సవరించారు. ఈ మేరకు ఈ పాట అనౌన్స్‌మెంట్ కోసం ఓ ఫన్నీ వీడియోను షూట్ చేశారు. ‘నేను పాడతా’ అంటూ వెంకీ దర్శకుడు అనిల్ రావిపూడి వెంటపడటం ఫన్నీగా ఉండటంతో ప్రేక్షకులు ఈ వీడియో చూసి తెగ నవ్వుకుంటున్నారు.

ఇక ఈ పాటను భీమ్స్ రాకింగ్ మ్యూజిక్‌తో కంపోజ్ చేశాడట. ఈ పాటను అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్, అతడి మాజీ గర్ల్‌ఫ్రెండ్‌గా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు.

The post గొంతు సవరించిన వెంకీ మామ! first appeared on Andhrawatch.com.

About

Check Also

ఎందుకలా హాట్‌టాపిక్‌ అయ్యిందంటే! | CineChitram

ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్‌లోని 29వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్దమవుతున్నాడు. ఈ సినిమాను దర్శకధీరుడు …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading