గోదారి గట్టు మీద పాట రికార్టుల వేట! | CineChitram

గోదారి గట్టు మీద పాట రికార్టుల వేట! టాలీవుడ్‌ యూనిక్ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అలాగే యూనిక్ గొంతు ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కచ్చితం గా రమణ గోగుల అని చెప్పొచ్చు. మెయిన్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకి సాలిడ్ మ్యూజిక్ అందించి హైలైట్ అయిన ఆయన ఇతర స్టార్స్ కి కూడా మంచి బీట్స్ ని తన వోకల్స్ లో పాటల్ని అందించారు.

అయితే చాలా కాలం నుంచి రమణ గోగుల కొత్త పాటలు లేవు తన సంగీతం కూడా లేదు. కానీ ఫైనల్ గా “సంక్రాంతికి వస్తున్నాం” మేకర్స్ రమణ గోగులని ఓ స్పెషల్ పాటతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారని చెప్పాలి. వెంకీ మామ, ఐశ్వర్య రాజేష్ లతో దర్శకుడు అనీల్ రావిపూడి ప్లాన్ చేసిన ఈ పక్కా ఎంటర్టైనర్ నుంచి ఫస్ట్ సింగిల్ గా టీజ్ చేస్తూ వచ్చిన గోదారి గట్టు సాంగ్ సెన్సేషనల్ చార్ట్ బస్టర్ అయ్యింది.

వచ్చిన ఈ కొన్ని రోజుల్లోనే ఏకంగా 50 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసి సాలిడ్ రికార్డు వెంకీ మామ కెరీర్ లో సెట్ చేసింది. ఇలా మొత్తానికి మాత్రం భీమ్స్ సంగీతంలో రమణ గోగుల ఇచ్చిన కంబ్యాక్ మాత్రం బ్లాక్ బస్టర్ అయ్యిందనే విషయం తెలిసిందే.

https://youtu.be/L8s6qxQJKgk?si=EIgW-GZMMVGZb9hh

The post గోదారి గట్టు మీద పాట రికార్టుల వేట! first appeared on Andhrawatch.com.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …