గోపి కోసం పూరీ! డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. లైగర్, డబుల్ ఇస్మార్ట్ వంటి డిజాస్టర్ల తర్వాత కొత్త సినిమా కోసం రెడీ అయ్యాడు. హీరో గోపీచంద్‌కు ఓ కథ వినిపించినట్లు తెలుస్తోంది. త్వరలోనే సినిమాపై అధికారిక ప్రకటన వస్తుందని తెలుస్తోంది. అన్నట్టు వీరిద్దరి కాంబోలో 2010లో వచ్చిన ‘గోలీమార్’ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. నిజానికి పూరి జగన్నాథ్ – బాలయ్య కలయికలో సినిమా వస్తోంది అంటూ బాగా ప్రచారం జరిగింది. ఐతే, ప్రస్తుతం పూరి – గోపీచంద్ కాంబినేషన్ లో సినిమా వస్తోంది అంటూ ప్రచారం జరుగుతుంది. అన్నట్టు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా వచ్చిన “డబుల్ ఇస్మార్ట్” ఆశించిన స్థాయిలో పాజిటివ్ టాక్ ను తెచ్చుకోలేక పోయింది. ముఖ్యంగా పూరి గత సినిమాలతో పోల్చుకుంటే.. ఈ సినిమాలో బలమైన కంటెంట్ మిస్ అయ్యింది అంటూ కామెంట్స్ వినిపించాయి. ఈ నేపథ్యంలో పూరి, గోపీచంద్ కోసం ఎలాంటి కథను రాశాడో చూడాలి.
The post గోపి కోసం పూరీ! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
