యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్ గా మాస్ యాక్షన్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమా “దేవర”. అయితే ఈ చిత్రం సోలోగా ఎన్టీఆర్ కెరీర్లోనే రికార్డు గ్రాసర్ గా నిలిచి దుమ్ము లేపింది. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రాన్ని మేకర్స్ ఇపుడు జపాన్లో కూడా రిలీజ్ కి సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. జపాన్ లో ఈ చిత్రంని ఈ మార్చ్ 28న గ్రాండ్ గా రిలీజ్ చేస్తుండగా ఎన్టీఆర్ కూడా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం వెళ్లనున్నాడు.
అయితే అక్కడ రిలీజ్ కి ఇంకా 3 వారాలు ముందే దేవర మేనియా అక్కడ మొదలపోయింది. అక్కడ బుకింగ్స్ ఇలా ఓపెన్ చేస్తే అలా హౌస్ ఫుల్స్ అయ్యిపోతున్నాయి. అంతే కాకుండా పలు ఫేమస్ ఐమ్యాక్స్ స్క్రీన్స్ లో కూడా దేవర ఇదే ర్యాంపేజ్ చూపించడం విశేషం. దీనితో జపాన్లో కూడా దేవర మేనియా గట్టిగానే ఉందని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.
The post జపాన్ లో దేవర మేనియా! first appeared on Andhrawatch.com.