అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా సినిమా ‘తండేల్’ ఫిబ్రవరి 7న గ్రాండ్ విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమాను డైరెక్టర్ చందూ మొండేటి డైరెక్ట్ చేస్తుండగా పూర్తి లవ్ స్టోరీ పీరియాడిక్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను GA2 బ్యానర్‌పై బన్నీ వాస్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.
కాగా, ఈ సినిమాకు భారీ బడ్జెట్ అయ్యిందని.. అయితే, ఈ చిత్ర ఓటీటీ రైట్స్ రూపంలో సగానికంటే ఎక్కువగా రికవర్ అయినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ మంచి ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుందని తెలుస్తుంది. ఇక తండేల్ సినిమా విడుదలైన 50 రోజుల తర్వాతే ఓటీటీ స్ట్రీమింగ్కు రానున్నట్లు తెలుస్తోంది.
The post తండేల్ ఓటీటీ విడుదల ఎప్పుడంటే! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
