అక్కినేని వారి యంగ్ అండ్ ఫైనెస్ట్ హీరో అక్కినేని నాగ చైతన్య బర్త్ డే నేడు కావడంతో అక్కినేని ఫ్యాన్స్ అలాగే తన అభిమానులు తనకి బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఇక దీంతో పాటుగా తన సినిమాల నుంచి అప్డేట్స్ కూడా వస్తుండగా ఈ క్రమంలోనే తన తరువాత భారీ సినిమాపై ఇపుడు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.
అయితే తన నెక్స్ట్ సినిమాగా తన కెరీర్ 24వ చిత్రాన్ని యంగ్ దర్శకుడు “విరూపాక్ష” ఫేమ్ కార్తీక్ దండుతో మేకర్స్ ఇపుడు అనౌన్స్ చేసేసారు. ఇక థ్రిల్లింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో ఒక ప్రామిసింగ్ ట్రీట్ ని అయితే అందించనున్నట్టుగా ఇందులో కనపడుతుంది.
మరి అది ఆవు కన్నులా కనిపిస్తుండగా అందులో నాగ చైతన్య ఒక జలపాతం ముందు నిలబడి కనిపిస్తున్నాడు. దీనితో ఇదేదో ఇంట్రెస్టింగ్ అడ్వెంచరస్ థ్రిల్లర్ లా ఉండేలా కనిపిస్తుంది. ఇక ఈ సినిమాకి కూడా అజనీష్ లోకనాథ్ సంగీతం సమకూరుస్తుండగా… సుకుమార్ అలాగే బివిఎస్ఎన్ ప్రసాద్ లు నిర్మాణం చేపట్టారు.
The post థ్రిల్లింగ్ పోస్టర్ తో …! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
