నటసింహం బాలయ్య – దర్శకుడు బాబీ కాంబోలో “డాకు మహారాజ్” సినిమా సంక్రాంతి కానుకగా గ్రాండ్ విడుదలకు సిద్దం అవుతోంది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ మూవీలో ‘దబిడి దిబిడి’ సాంగ్ కి మంచి లభించింది. అయితే, ఈ సాంగ్ లోని స్టెప్స్‌పై సినీ క్రిటిక్ కేఆర్కే సంచలన కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.
తెలుగు ఇండస్ట్రీ వాళ్లు ఇలాంటి పాట చేసేకంటే పోర్న్ ఫిల్మ్స్ తీస్తే బెటర్ అని, ఊర్వశీ కూడా సిగ్గుపడాలని పోస్ట్ పెట్టాడు. కాగా క్రిటిక్ కేఆర్కే పోస్ట్ పై ఊర్వశీ కౌంటర్ ఇస్తూ.. ‘ఏమీ సాధించలేదని కొంతమంది ఎప్పుడు కష్టపడే వారిని విమర్శించడం విడ్డూరమని తెలిపారు. నిజమైన పవర్ ఇతరులను కించపరచడం కాకుండా వారిని పైకి లేపడంలో ఉంటుంది’ అని ఊర్వశీ చాలా ఘూటుగా సమాధానమిచ్చింది.
ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా బాగా హైలైట్ గా ఉంటాయట. ముఖ్యంగా ద్వితీయార్థంలో వచ్చే ఫ్యామిలీ ఎపిసోడ్ సినిమా మొత్తానికే మెయిన్ గా ఉంటుందని, ఆ ఎపిసోడ్ లోని బాలయ్య – ప్రగ్యా జైస్వాల్, చిన్న పాప పాత్రల మధ్య వచ్చే ఎమోషన్స్ ఆడియెన్స్‌ను కట్టిపడేస్తాయని తెలుస్తుంది.
The post ‘దబిడి దిబిడి’ సాంగ్ పై పోస్ట్ కి ఊర్వశీ మాములు రిప్లై కాదు! first appeared on Andhrawatch.com.