పవర్ఫుల్ గా “దేవకీ నందన వాసుదేవ” ట్రైలర్.. | CineChitram

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అశోక్ గల్లా హీరోగా మానస వారణాసి హీరోయిన్ గా దర్శకుడు అర్జున్ జంధ్యాల తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రమే “దేవకీ నందన వాసుదేవ”. మరి యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్‌  ప్రశాంత్ వర్మ కథ అందించిన ఈ సినిమా నుంచి ఇపుడు మేకర్స్ సాలిడ్ ట్రైలర్ కట్ ని అయితే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. మరి ఈ ట్రైలర్ చూస్తే కథలో ప్రశాంత్ వర్మ మైథాలజీ టచ్ క్లియర్ గా కనపడుతుంది.

ప్రపంచంలోనే అతి పెద్ద సుదర్శన చక్రం అంటూ మొదలైన ట్రైలర్ మంచి ఆసక్తి రేపుతోంది. అలాగే హీరో పాత్రకి ఏదో జాతక దోషం దాని వల్ల ఎదురయ్యే సవాళ్లు అలాగే విలన్ కి తన మేనల్లుడు వలనే ప్రాణ హాని వంటి వాటిపై చూపిన సన్నివేశాలు పవర్ఫుల్ గా ఉన్నాయి. అలాగే తన రోల్ లో అశోక్ గల్లా మాత్రం మంచి మాస్ అండ్ రగ్గుడ్ లుక్ లో కనిపిస్తున్నాడని చెప్పాలి.

తన లుక్స్, యాక్షన్ ఇందులో బాగున్నాయి. అలాగే సీనియర్ నటి ఝాన్సీ కూడా ఓ సాలిడ్ రోల్ చేసినట్టుగా కనిపిస్తుంది. అలాగే విలన్ పాత్రలో కనిపించిన నటుడు కూడా చాలా పవర్ఫుల్ గా అనిపిస్తున్నాడు. ఇంకా భీమ్స్ ఇచ్చిన స్కోర్ ఇందులో బాగుంది. మరి మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియెన్స్ ని అలరించే విధంగా ఈ సినిమా ఉండేలా అనిపిస్తుంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఈ నవంబర్ 22 వరకు ఆగితే సరి.

The post పవర్ఫుల్ గా “దేవకీ నందన వాసుదేవ” ట్రైలర్.. first appeared on Andhrawatch.com.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …