నిజానికి రాశి ఖన్నా సినిమా పరిశ్రమకు వచ్చి చాలా కాలమే అయింది కానీ ఆమెకు వేరే హీరోలతో కానీ నటులతో కానీ అఫైర్స్ ఉన్నట్లు వార్తలు చాలా అరుదుగానే వినిపించాయి. అయితే తాజాగా ఆమె తన పెళ్లి గురించి ఓపెన్ కామెంట్లు చేసింది. తాజాగా హైదరాబాద్లో జరిగిన ఏబీపీ సౌత్ సమ్మెలో చేతన్ భగత్ ఆమె పెళ్లికి సంబంధించి కొన్ని ప్రశ్నలు అడిగారు.
దానికి ఆమె స్పందిస్తూ అది నా పర్సనల్ విషయం కాబట్టి ఇప్పుడు నేను దాని గురించి ప్రస్తావించాలనుకోవడం లేదని లేదని సున్నితంగా మాట దాటేసింది. ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ నాకు కూడా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలనే ఉంది కానీ దానికి టైం ఉంది అది నా పర్సనల్ విషయం నా వృత్తితో దాన్ని కలపాల్సిన అవసరం లేదు అని ఆమె చెప్పుకొచ్చింది. సబర్మతి రిపోర్టు సినిమాలో ఆమె ఒక కీలక పాత్రలో యాక్ట్ చేసింది. ఆ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందు సందడి చేయబోతుంది.
The post పెళ్లి పై రాశీ కీలక వ్యాఖ్యలు! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
