పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్టార్ లైనప్ లో భారీ అంచనాలు ఉన్న మూవీ ‘స్పిరిట్’. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఓ పవర్ ఫుల్ కాప్ స్టోరీగా రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి అయింది. ప్రస్తుతం కీలక నటీనటుల వెతుకులాట మొదలు పెట్టారు. అన్నట్టు ఈ సినిమాలో కొరియన్, అమెరికన్ యాక్టర్స్ కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో ఇతర భాషలకు సంబంధించిన స్టార్స్ ను కూడా తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మలయాళ మెగాస్టార్ మమ్మూట్టిని ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం తీసుకుంటారట.
కాగా మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ తో సందీప్ రెడ్డి మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా పూర్తి చేశాడు. ఆ మధ్య హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ.. ‘ప్రభాస్ తో చేసిన సినిమాలకు విజిల్ సౌండ్ సెంటిమెంట్ అని, ,దాన్ని కొనసాగిస్తానని హర్షవర్ధన్ రామేశ్వర్ పేర్కొన్నారు. ‘స్పిరిట్’ మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. సందీప్ రెడ్డి వంగా నుంచి మరో వినూత్న మూవీ రానున్నట్లు తెలుస్తోంది.
The post ప్రభాస్ మూవీ లో మరో స్టార్ హీరో! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
