ప్రభాస్‌ స్పిరిట్‌ లో మెగాస్టార్‌! | CineChitram

గ్లోబల్ స్టార్ ప్రభాస్ స్టార్ లైనప్‌లో ఉన్న సినిమాల్లో భారీ సినిమా ‘స్పిరిట్’ కూడా ఒకటి. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో ఉన్న ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే టాక్‌ అయితే బయటకు వచ్చింది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కూడా ఈ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.
ఇప్పటికే, స్టార్ జంట సైఫ్ అలీఖాన్ – కరీనా కపూర్ స్పిరిట్ లో నటిస్తున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి. ఇప్పుడు మమ్ముట్టి పేరు కూడా వినిపిస్తోంది. అయితే, టీమ్ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కానుంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్‌’ సినిమా రాబోతుంది.

‘స్పిరిట్‌’ మెయిన్ కథాంశమే చాలా కొత్తగా, వినూత్నంగా ఉంటుందని.. సందీప్ రెడ్డి వంగా నుంచి మరో సరికొత్త సినిమా రాబోతుందని తెలుస్తుంది. అలాగే, సందీప్ రెడ్డి వంగా మార్క్ యాక్షన్ సీన్స్ అండ్ వైల్డ్ ఎలిమెంట్స్ సినిమాలో ఫుల్ గా ఉంటాయని సమాచారం. దాదాపు రూ.400 కోట్లకు పైగా బడ్జెట్‌ తో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.

The post ప్రభాస్‌ స్పిరిట్‌ లో మెగాస్టార్‌! first appeared on Andhrawatch.com.

About

Check Also

NBK’s Daaku Maharaaj show its dominance at BO | CineChitram

The most anticipated flick of Nandamuri Balakrishna, Daaku Maharaaj has garnered a positive talk all …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading