ప్రీ రిలీజ్ రద్దు..కొత్త తేదీ ఎప్పుడంటే! యంగ్ అండ్ ఫైనెస్ట్ హీరో నాగ చైతన్య అక్కినేని హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ మూవీ “తండేల్” గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ ని మేకర్స్ జోరుగా పాన్ ఇండియా లెవెల్లో చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో మన దగ్గర జరిగే ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం చాలా మంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మేకర్స్ ఈ ప్రీ రిలీజ్ ని నేడు ఫిబ్రవరి 1కి ఫిక్స్ చేశారు కానీ ఇపుడు దీనిని వాయిదా వేసినట్టుగా ప్రకటించారు.
చాలా మంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పెషల్ గెస్ట్ గా వస్తుండడంతో మరింత ఆసక్తి కనబరచగా ఇపుడు ఈ ఈవెంట్ ని రద్దు చేసి మరింత ఘనంగా జరుపుకుందాం అంటూ కొత్త డేట్ ని ప్రకటించారు. దీంతో ఆదివారం ఫిబ్రవరి 2న చేస్తున్నట్టుగా కొత్త తేదీని ప్రకటించారు. సో రేపటి వరకు ఎగ్జైట్మెంట్ ని అభిమానులు ఆపుకోవాల్సిందే అని మూవీ మేకర్స్ చెప్పుకొచ్చారు.
The post ప్రీ రిలీజ్ రద్దు..కొత్త తేదీ ఎప్పుడంటే! first appeared on Andhrawatch.com.