బాలయ్య వాయిస్‌ ఓవర్‌ ఫర్‌ వీడీ 12 | CineChitram

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా సినిమా ‘VD12’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరికొత్త మాస్ అవతారంలో కనిపించబోతున్న ఈ మూవీని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే, ఈ సినిమా నుండి త్వరలోనే ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ రానుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను త్వరలోనే రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారట. కాగా, ఈ టీజర్‌కు సంబంధించి సోషల్ మీడియాలో ఓ క్రేజీ వార్త షికారు చేస్తుంది. ఈ టీజర్‌లో నందమూరి బాలకృష్ణ వాయిస్ ఓవర్ ఉండనుందనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

దీంతో అభిమానుల్లో ఒక్కసారిగా VD12 టీజర్‌కి సంబంధించిన ఆసక్తి అయితే క్రియేట్‌ అయ్యింది. మరి నిజంగానే ఈ సినిమా టీజర్‌లో బాలయ్య పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్ వినిపిస్తుందా.. లేక ఇదంతా కేవలం రూమర్‌గానే మిగిలిపోతుందా.. అనేది వేచి చూడాలి.

The post బాలయ్య వాయిస్‌ ఓవర్‌ ఫర్‌ వీడీ 12 first appeared on Andhrawatch.com.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …