మరో సీక్వెల్‌కు రెడీ అవుతున్న తేజా సజ్జా! | CineChitram

మరో సీక్వెల్‌కు రెడీ అవుతున్న తేజా సజ్జా! టాలీవుడ్ లో గత ఏడాది సంక్రాంతికి వచ్చిన భారీ హిట్ సినిమా “హను మాన్” గురించి అందరికీ తెలిసిందే. రికార్డు వసూళ్లు అందుకున్న ఈ సినిమా ఓ రేంజ్‌ లో అదరగొట్టింది. మరి ఈ సినిమాకి గ్రాండ్ సీక్వెల్ గా “జై హనుమాన్” ని కూడా ఇపుడు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడగా ఇపుడు ఈ సీక్వెల్ కాకుండా ఇదే కాంబో నుంచి మరో మ్యాడ్ సీక్వెల్ వస్తుంది అని సమాచారం.హను మాన్ కంటే ముందు వచ్చిన క్రేజీ సినిమా “జాంబీ రెడ్డి” ఎలా ఎంటర్టైన్ చేసిందో అందరికీ తెలిసిందే.

మరి ఈ సినిమా వచ్చి నిన్నటితో నాలుగేళ్లు పూర్తయింది. అయితే ఈ సినిమాకే ఇపుడు ప్రశాంత్ వర్మ, తేజ సజ్జలు సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా రూమర్స్ వినపడుతున్నాయి. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే తేజ చేసిన సస్పెన్స్ పోస్ట్ కూడా వైరల్ గా మారింది. దీనితో ఈ సినిమా సీక్వెల్ కూడా వస్తుందా అనేది చూడాల్సిందే.

The post మరో సీక్వెల్‌కు రెడీ అవుతున్న తేజా సజ్జా! first appeared on Andhrawatch.com.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …