మరోసారి లీక్‌ షాక్‌..మళ్లీ అక్కడ నుంచే! | CineChitram

మరోసారి లీక్‌ షాక్‌..మళ్లీ అక్కడ నుంచే! గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియార అద్వానీ, అంజలి హీరోయిన్లుగా డైరెక్టర్‌ శంకర్ రూపొందించిన భారీ పాన్ ఇండియా మూవీ “గేమ్ ఛేంజర్” రీసెంట్ సంక్రాంతి కానుకగా విడుదలకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

అయితే ఈ సినిమా విడుదల అయిన రోజే ఆన్లైన్ లో ఫుల్ క్లారిటీతో కూడిన ప్రింట్ సోషల్ మీడియాలో లీక్ అవ్వడం షాకింగ్ గా మారింది. మరి ఇది చిత్ర యూనిట్ కి పెద్ద దెబ్బగా మారగా ఇపుడు మరో లీక్ షాకిచ్చినట్టు తెలుస్తోంది. ఈసారి తమిళ్ వెర్షన్ లో ఫుల్ 4k క్లారిటీతో పాటుగా ఒరిజినల్ ఆడియోతో కూడిన ప్రింట్ బయటకు వచ్చేసిందట.

దీనితో ఓటీటీలో రాకముందే ఒరిజినల్ ప్రింట్ బయటకు వచ్చేసినట్టు అయ్యిందని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో మరికొన్ని సినిమాలు కూడా తమిళ్ వెర్షన్ నుంచే ఇలా లీక్ అవ్వడం గమనార్హం. ఇక గేమ్ ఛేంజర్ చిత్రానికి థమన్ సంగీతం అందించారు అలాగే దిల్ రాజు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

The post మరోసారి లీక్‌ షాక్‌..మళ్లీ అక్కడ నుంచే! first appeared on Andhrawatch.com.

About

Check Also

Yash’s moves to steal the spotlight in Toxic | CineChitram

The rocking star Yash is joining forces with the acclaimed director Geethu Mohandas for Toxic …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading