అయితే మళ్ళీ ఫైనల్ గా ఆ అందరికీ ఈ ఇద్దరు యంగ్ హీరోస్ స్వీట్ షాకిచ్చారు. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన క్లాసిక్ హిట్ చిత్రం “ఎవడే సుబ్రహ్మణ్యం” మళ్ళీ రీరిలీజ్ కి వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మళ్ళీ విడుదల కోసం ఈ యువ హీరోలు ఒక్కటయ్యారు. ఆ సినిమాలో ఒక ఐకానిక్ సీన్ ని రీక్రియేట్ చేసిన పిక్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నాని హిట్ 3 లుక్ లో విజయ్ కింగ్డమ్ లుక్ లో బైక్ మీద కూర్చున్నట్టు కనిపిస్తున్నారు. ఇక వీరితో పాటుగా నంది.. అదే మాళవిక నైర్ కూడా కనిపిస్తుంది. దీనితో ఈ స్పెషల్ పిక్ వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రాన్ని కల్కి 2898 ఎడి దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించగా ప్రియాంక దత్, స్వప్న దత్ లు నిర్మాణం వహించారు.
The post మళ్లీ కలిసిన నాని విజయ్ దేవరకొండ! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
