మహారాణిలా రీతూ వర్మ..ఎందులో అంటే! | CineChitram

మన తెలుగు సినిమాలో ఉన్నటువంటి అతి తక్కువమంది తెలుగు హీరోయిన్స్ లో యంగ్ అండ్ హోమ్లీ బ్యూటీ రీతూ వర్మ కూడా ఒకరు చెప్పాలి. అందం, ప్రతిభ గల రీతు వర్మ పెళ్లి చూపులు, టక్ జగదీశ్, వరుడు కావలెను, కనులు కనులను దోచాయంటే వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దు గుమ్మ.

ఫిలింమేకర్స్ లో ప్రామిసింగ్ యంగ్ యాక్ట్రెస్ గా పేరు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళంలోనూ పలు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తోంది ఆ భామ. ఆమె అప్ కమింగ్ రిలీజ్ స్వాగ్ తో మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు ముందుకు వస్తుంది. శ్రీ విష్ణుతో చేస్తున్న ఈ “స్వాగ్” సినిమాలో వింజామర వంశ మహారాణి రుక్మిణీ దేవి పాత్రలో రీతు వర్మ కనిపించనుంది.

మహారాణి రుక్మిణీదేవి పాత్రతో ఆమె అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. స్వాగ్ లో రీతు వర్మ క్యారెక్టర్ హైలైట్ కానుందనే అంచనాలు ఉన్నాయి. ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ చేసేందుకు ఇష్టపడే రీతు వర్మ..మహారాణి రుక్మిణీదేవి పాత్ర కోసం ప్రత్యేకంగా రెడీ అవుతుంది. ఆమె ఎఫర్ట్ స్క్రీన్ మీద కనిపించబోతోంది.

అలాగే ప్రస్తుతం రీతు వర్మ తెలుగుతో పాటు తమిళంలోనూ పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తోంది. హాట్ స్టార్ కోసం ఓ వెబ్ సిరీస్ లో యాక్ట్‌ చేస్తుది. రీతు వర్మకు ఈ సిరీస్ డిజిటల్ డెబ్యూ కానుంది. శ్రీ విష్ణు హీరోగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో దర్శకుడు ‘రాజ రాజ చోర’ ఫేమ్ హసిత్ గోలి రూపొందించిన స్వాగ్ మూవీ అక్టోబర్ 4న థియేటర్స్ లోకి రాబోతుంది.

The post మహారాణిలా రీతూ వర్మ..ఎందులో అంటే! first appeared on Andhrawatch.com.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …