టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవదళపతి సుధీర్ బాబు హీరోగా నటించిన తాజా సినిమా మా నాన్న సూపర్ హీరో. దీని కంటే ముందే తాను నటించిన సినిమా “హరోం హర” యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వస్తే ఈసారి సుధీర్ బాబు పూర్తి ఎమోషనల్ క్లాస్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
మరి ఈ సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుండగా మూవీ మేకర్స్ ఈరోజు ట్రైలర్ లాంచ్ ని ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.మరి ఈ ట్రైలర్ లాంఛ్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబుని రంగంలోకి దింపుతున్నారు. మరి ఈరోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకి విడుదల చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.
ఇంతకు ముందు ప్రేక్షకుల ముందుకు వచ్చిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాల్సిందే.
The post మా నాన్న సూపర్ హీరో కోసం రంగంలోకి సూపర్ స్టార్! first appeared on Andhrawatch.com.