మాజిరాజు కోసం రంగంలోకి ముఫాసా! | CineChitram

యాంకర్ నుండి హీరోగా మారిన ప్రదీప్ మాచిరాజు నటిస్తున్న తాజా సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను నితిన్-భరత్ సంయుక్తంగా డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి తాజాగా ఫస్ట్ సింగిల్ సాంగ్‌కు సంబంధించిన ప్రోమోను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు.

లేలే లేలే అంటూ సాగే ఈ మెలోడీ పాటను లెజెండరీ సింగర్ ఉదిత్ నారాయణ్ ఆలపించారు. ఇక రధాన్ ఈ పాటకు మంచి ట్యూన్‌ను కంపోజ్ చేసి అందించాడు. అటు ఈ పాటను శేఖర్ మాస్టర్ అద్భుతంగా కొరియోగ్రఫీ చేసినట్లుగా ప్రోమోలో కనపడుతుంది. అయితే, ఈ పాటను నవంబర్ 27న 4.05 గంటలకు సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేసినట్లు చిత్ర బృందం తెలిపింది. మాచిరాజు కోసం ముఫాసా వస్తున్నాడు..అంటూ వారు ట్యాగ్ చేయడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి కలుగుతుంది

ఈ సినిమాలో దీపికా పిల్లి హీరోయిన్‌గా నటిస్తోండగా వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను, మురళీధర్ గౌడ్ ఇతర ముఖ్య పాత్రల్లో చేస్తున్నారు.

The post మాజిరాజు కోసం రంగంలోకి ముఫాసా! first appeared on Andhrawatch.com.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …