మోక్షు ఎంట్రీ పై ప్రశాంత్‌ వర్మ ఏమన్నారంటే! | CineChitram

బాలయ్య కొడుకు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అదిగో ఇదిగో అని గత నాలుగు ఐదు సంవత్సరాలుగా ఆశపెడుతున్నారే తప్ప మోక్షు ఎంట్రీ ఎప్పుడు అనేది మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.  ఇటీవల మోక్షజ్ఞ ఎంట్రీఫై రకరకాల వార్తలు వినిపించాయి. ప్రశాంత్ వర్మ మోక్షుని లాంఛ్ చేయబోతున్నాడు, బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని నిర్మాతగా వ్యవహరిస్తోంది  అని అనేక వార్తలు టాలీవుడ్‌ లో చక్కర్లు కొట్టాయి.

కానీ అధికారకంగా ప్రకటించలేదు. తాజాగా వాటన్నిటిని నిజం చేస్తూ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఓ ట్వీట్‌ చేశాడు. తన వ్యక్తిగత ‘X’ లో బాలయ్య ముద్దుల తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ నుద్దేశిస్తూ ‘సింబా ఈజ్ కమింగ్’ హాష్ ట్యాగ్ జత చేసి సింబా లోని పోస్టర్ ను పోస్ట్ చేసాడు. ఈ పోస్ట్ సొషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సెప్టెంబరు 6న మోక్షజ్ఞ పుట్టిన రోజు.

ఆరోజు అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. హనుమాన్ సినిమాగా మాదిరిగానే బాలయ్య కొడుకు సినిమా కూడా మైథలాజికల్‌ టచ్ తో ఉన్న సోషియో ఫాంటసీ నేపథ్యంలో సాగుతుందనే మాటలు వినిపిస్తున్నాయి. నందమూరి కుటుంబానికి చెందిన రామకృష్ణ సినీ స్టూడియోస్ లో ఈ సినిమా పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో బాలయ్య  కృష్ణుడి పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది.

సినిమా చివర 20 నిమిషాలు మాములుగా ఉండదని టాక్ కూడా వినిపిస్తుంది. ప్రస్తుతం మోక్షు వైజాగ్ లో సత్యానంద్ వద్ద నటనలో శిక్షణ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అటు డాన్స్, గుర్రపు స్వారీ లోను మోక్షజ్ఞ  శిక్షణ తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

The post మోక్షు ఎంట్రీ పై ప్రశాంత్‌ వర్మ ఏమన్నారంటే! first appeared on Andhrawatch.com.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …