మోక్షు మూవీ పై తాజా అప్డేట్ ఏంటంటే! ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన భారీ చిత్రం “డాకు మహరాజ్” విడుదలకి వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. బాలయ్య, బాబీ కాంబోలో ప్లాన్ చేసిన ఈ సినిమాపై ఇపుడు క్రేజీ హైప్ అయితే నెలకొంది.
ఇక ఈ సినిమా కాకుండా నందమూరి అభిమానులని ఓ రేంజ్ లో ఎగ్జైట్ చేస్తున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది నందమూరి నటసింహ వారసుడు నందమూరి మోక్షజ్ఞ మూవీ కోసమే అని చెప్పుకొవచ్చు. టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఆమధ్య కొన్ని రూమర్స్ వచ్చాయి. కానీ ఇపుడు వీటిపై ఓ క్లారిటీ వస్తుంది.
దీంతో ఈ సినిమా ఈ రానున్న ఫిబ్రవరి నుంచే సెట్స్ మీదకి వెళ్లనున్నట్టు సమాచారం. దీంతో నందమూరి అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకొవచ్చు.
The post మోక్షు మూవీ పై తాజా అప్డేట్ ఏంటంటే! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
