టాలీవుడ్లో తెరకెక్కిన క్రేజీ సీక్వెల్ మూవీ ‘మ్యాడ్ స్క్వేర్’ బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ రన్‌తో దూసుకెళ్తోంది. కథతో సంబంధం లేకుండా ఈ సినిమాలోని కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు కూడా లభిస్తున్నాయి. ఈ సినిమా దాదాపు అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్‌కు చేరుకుందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు.
ఇక ఈ సినిమాకు ప్రేక్షకులు అందిస్తున్న ఆదరణతో ఈ చిత్ర సక్సెస్ మీట్‌ను ఏప్రిల్ 4న ఘనంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. కాగా, ఈ సక్సెస్ మీట్ ఈవెంట్‌కు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ అతిథిగా రానున్నట్లు తెలుస్తుంది. దీంతో ఈ సక్సెస్ మీట్‌పై ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లోనూ ఆసక్తి క్రియేట్ అవుతుంది.
‘మ్యాడ్ స్క్వేర్’ మూవీలో నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ ముఖ్య పాత్రల్లో నటించారు.
The post మ్యాడ్ స్క్వేర్ కోసం తారక్! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
