మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ లో ర్యాపో 22 ! | CineChitram

యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ RAPO22 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాను దర్శకుడు పి.మహేష్ బాబు డైరెక్ట్ చేస్తుండగా పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తీస్తున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ సరికొత్త లుక్స్‌తో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు.

కాగా, ఈ సినిమాకు వివేక్-మర్విన్ అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే, ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ ఇప్పటికే మొదలు పెట్టారు. తాజాగా ఈ మ్యూజిక్ సిట్టింగ్స్‌లో హీరో రామ్ పోతినేనితో పాటు దర్శకుడు పి.మహేష్ బాబు కూడా జాయిన్ అయ్యారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ సినిమాలో అందాల భామ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఈ సినిమాపై మంచి బజ్‌ని క్రియేట్ చేశాయి.

The post మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ లో ర్యాపో 22 ! first appeared on Andhrawatch.com.

About

Check Also

Vishwaksen Shines in Laila: A Unique Dual Role for Valentine’s Day | CineChitram

Vishwaksen’s upcoming film Laila, which is grabbing attention due to its bold storyline and innovative …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading