టాలీవుడ్ సీనియర్ నటుల్లో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ ఒకరు. ఆయన తెలుగు సినిమాలో కామెడీ జానర్ కి ఒక కొత్త నిర్వచనంలా మారిన తాను ఇప్పుడు కూడా పెద్ద సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఆయన కుటుంబానికి సంబంధించి ఇప్పుడు ఓ విషాద వార్త అయితే బయటకి వచ్చింది.
రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె గాయత్రి తన 38 వ ఏట గుండె నొప్పితో కన్ను మూశారు. ఈ వార్త ఇపుడు వారి ఇంట తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ విషాద ఘటనతో రాజేంద్ర ప్రసాద్ కుప్పకూలిపోయారని తెలుస్తుంది, ఆయన తన గారాల పట్టి ఇక లేదు అని కన్నీరు మున్నీరు అవుతున్నారట.
అయితే గాయత్రీ ఒక న్యూట్రిషన్ అడ్వైజర్ గా పని చేస్తుండగా తన భర్త మహేంద్ర అండ్ మహేంద్రలో పని చేస్తున్నారు. అలాగే వారి కూతురు రాజేంద్ర ప్రసాద్ తో మహానటి సినిమాలో లో చిన్ననాటి సావిత్రి పాత్రలో కనిపించింది. ఈ విషయం గురించి తెలిసిన సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
The post రాజేంద్రప్రసాద్ కుమార్తె మృతి! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
