రామ్ లో ఈ టాలెంట్ కూడా ఉందా! టాలీవుడ్ దగ్గర ఉన్నటువంటి టాలెంటెడ్ యంగ్ హీరోస్ లో మిల్కీ అండ్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని కూడా ఒకరు. మరి రామ్ హీరోగా ఇపుడు దర్శకుడు మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మేకర్స్ శరవేగంగా ఈ చిత్రాన్ని ఏపీలో పలు లొకేషన్స్ లో తెరకెక్కిస్తున్నారు. అయితే హీరో రామ్ మంచి టాలెంట్ కలిగిన నటుడు, మన తెలుగు సినిమా దగ్గర క్రేజీ డాన్స్ మూమెంట్స్ చేసే అతి తక్కువమంది హీరోస్ లో తాను కూడా ఒకరు అని తెలిసిందే. అయితే తనలోని మరో టాలెంట్ ని ఇపుడు పరిచయం చేయబోతున్నారట.
ఇపుడు నటిస్తున్న సినిమా కోసమే తాను ఒక లవ్ సాంగ్ ని రాసినట్టుగా తెలుస్తుంది. దీనితో తాను రాసిన పాట తన ఫ్యాన్స్ ఆడియెన్స్ కూడా విననున్నారని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి వివేక్, మెర్విన్ ద్వయం సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.
The post రామ్ లో ఈ టాలెంట్ కూడా ఉందా! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
